![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1042 లో.. మను తండ్రి ఎవరో చెప్పు? నీకు సమాధానం తెలిసిన ప్రశ్న నే కదా ఎందుకు అలా మౌనంగా ఉంటున్నావని అనుపమని మహేంద్ర నిలదీస్తాడు. అయిన సైలెంట్ గానే ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఇంతే.. అప్పుడేమో ప్రశ్నలతో విసిగించేదానివి.. ఇప్పుడేమో మౌనంగా ఉండి విసిగిస్తున్నావ్.. అసలు నువ్వు విసిగించడానికే మా లైఫ్ లోకి వచ్చావని అనుపమపై మహేంద్ర అరుస్తాడు.
మావయ్య గారు మీరు ఆవేశపడకండి అంటు మహేంద్రతో వసుధార అంటుంది. అయిన అనుపమ మాత్రం పెదవి విప్పదు. మరొకవైపు దేవయాని, శైలేంద్ర రాజీవ్ లు ఒక దగ్గర కలిసి మను, అనుపమల గురించి మాట్లాడుకుంటారు. నేను ఆ అనుపమ సంగతి చూస్తాను. శైలేంద్ర నువ్వు మను సంగతి చూడమని దేవయాని చెప్పగా.. నేను నా మరదలు సంగతి చూస్తానని రాజీవ్ అంటాడు. ఇక నుండి మనం DRS అని దేవయాని అనగానే.. DRS వద్దు DSR అని శైలేంద్ర అంటాడు. ఎందుకు అలా అని దేవాయని అడుగుతుంది. అంటే DRS లో నా పేరు తన కంటే ముందు వస్తుంది కదా అని రాజీవ్ అంటాడు. మనలో మనం ఐకమత్యంగా లేకపోతే ఎలా అని దేవాయని అంటుంది. ఆ తర్వాత అనుపమ దగ్గరకి వసుధార వచ్చేసరికి.. తను ఉండదు. ఆ విషయం మహేంద్రకి చెప్పి. ఇంట్లో అంతా వెతుకుతారు. తన గదిలో ఒక లెటర్ రాసి వెళ్లిపోతుంది అనుపమ. నేను మీకు సమస్య కాకూడదు.. అందుకే వెళ్లిపోతున్నానని అందులో అనుపమ రాసి ఉంటుంది.
ఆ తర్వాత వసుధార, మహేంద్రలు కలిసి మను దగ్గరకు వెళ్ళి.. అనుపమ గురించి చెప్తారు. అప్పుడే అనుపమ వాళ్ళ పెద్దమ్మ వస్తుంది. తనకి ఇదంతా అలవాటే.. ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుందని ఆ పెద్దావిడ చెప్పగానే.. నీకు ఆవిడా ఎక్కడ ఉందో తెలుసు.. చెప్పకపోతే నా మీద ఒట్టే అని మను ఒట్టు వేసుకుంటాడు. దాంతో పెద్దావిడ అనుపమ ఎక్కడ ఉందో చెప్తుంది. ఇక వెంటనే మహేంద్ర, వసుధార, మను బయలుదేరి వెళ్తారు. మరొకవైపు అనుపమ వెళ్తూ మహేంద్ర అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే అనుపమ వెళ్తున్న కార్ కి అడ్డంగా దేవయాని వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |